: చంద్రబాబుపై విరుచుకుపడ్డ లక్ష్మీపార్వతి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారని... అలాగైతే 1.20 కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుందని విమర్శించారు. కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాల కల్పన సాధ్యమేనా అని ప్రశ్నించారు. అలాగే, లక్షా 50 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని హామీలిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 3 వేల కోట్లుగా ఉన్న అప్పులు... ఆయన దిగిపోయేటప్పుడు రూ. 36 వేల కోట్లకు పెరిగాయని ఆరోపించారు.