: ఏప్రిల్ 4 నుంచి మోగనున్న 'ఫేస్ బుక్' ఫోన్
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం 'ఫేస్ బుక్' మరికొద్ది రోజుల్లో ఓ అధునాతన ఫోన్ విడుదల చేయనుంది. ఆధునిక గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఏప్రిల్ 4న ఆవిష్కరించనున్న ఈ ఫోన్ ను తైవాన్ కు చెందిన హెచ్ టీసీ సంస్థ తయారు చేస్తోంది. కాగా, ఫోన్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను ఫేస్ బుక్ రూపొందించినట్టు తెలుస్తోంది. తాము ఓ నూతన తరం ఫోన్ ను మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నట్టు ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ గత సెప్టెంబర్ లోనే ప్రకటించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాము డెస్క్ టాప్ లను మాత్రం తయారు చేయబోవడంలేదని ఆయన తెలిపారు.