: ఇవాళ అప్పన్న కల్యాణోత్సవ వేడుక
విశాఖలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఇవాళ వైభవోపేతంగా జరగనుంది. చైత్ర మాస శుక్లపక్ష ఏకాదశి పర్వదినాన జరుగుతోన్న ఈ కల్యాణోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి కల్యాణాన్ని సుమారు పది వేల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా అధికారులు వేదికను రూపొందించారు. రాత్రి తొమ్మిది గంటలకు జాలరి కుటుంబ పెద్ద కదిరి లక్ష్మణరావు సారథ్యంలో స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్ర ముగిశాక స్వామివారికి నృసింహ మండపం తూర్పు మార్గంలోని ద్వారం గుండా కల్యాణ వేదిక వద్దకు తీసుకువస్తారు.