: మల్లికార్జునపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
కర్నూలు జిల్లా హాలహరి మండలంలోని మల్లికార్జునపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీకి చెందిన కార్యకర్తలు ఘర్షణ పడి రాళ్ల దాడులకు దిగడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ ఎలాంటి మార్పులేకుండా పోయింది. రెండు పక్షాలు చేసుకున్న దాడుల్లో 20 మంది గాయపడి ఆసుపత్రిపాలయ్యారు.