: నేను ఎందుకు ఖండించాలి?: దేవెగౌడ


అత్యాచారం చేసినంత మాత్రాన నిందితులకు ఉరిశిక్ష విధిస్తారా? అంటూ ఎస్పీ అధినేత ములాయం చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ నిరాకరించారు. ఈ రోజు బెంగళూరులో జేడీఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. 'ములాయం సింగ్ కు మాట్లాడే హక్కుంది. ప్రతి రాజకీయ పార్టీకి సొంత అభిప్రాయాలు ఉంటాయి. నేనెందుకు వారి అభిప్రాయాలను ఖండించాలి?' అంటూ ఇదే విషయమై తనను ప్రశ్నించిన విలేకరులను దేవెగౌడ ఎదురు ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News