: ఓటర్లను తరలిస్తున్న నాలుగు బస్సులు సీజ్
ఓటర్లను తరలిస్తున్న నాలుగు బస్సులను పోలీసులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామం వద్ద విజయవాడ నుంచి ఓటర్లను తరలిస్తున్న నాలుగు బస్సులను పోలీసులు సీజ్ చేశారు. నాలుగు బస్సుల్లో రెండు బస్సులు టీడీపీకి చెందినవి. కాగా, మరో రెండు వైఎస్సార్సీపీకి చెందినవి కావడం విశేషం.