: జగన్ సీబీఐ నుంచి ఎఫ్ బీఐ స్థాయికి ఎదిగాడు: సోమిరెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీబీఐ నుంచి ఎఫ్ బీఐ స్థాయికి ఎదిగిన అవినీతి పరుడని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, జగన్ అవినీతిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ పాలన ఇంకా సాగి ఉంటే గనులు ఉండేవి కాదని అన్నారు. ఎఫ్ బీఐ ప్రస్తావించిన పేరు సుందరలింగానిది కాదని జగన్ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
సుందరలింగం సుధీకర్ రెడ్డి బంధువు కాదని జగన్ నిరూపించగలరా? అని ఆయన సవాలు విసిరారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రతిష్ఠ పెంచితే వైఎస్ తెలుగు జాతి గౌరవాన్ని మంటగలిపారని ఆయన మండిపడ్డారు. నేరస్థుల సమూహమే వైఎస్సార్సీపీ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమైనదని, సీనియర్లు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.