: రాయపాటి గెలుపుకోసం కృషి చేస్తా: కోడెల
టీడీపీ అధినేత ఆదేశాల మేరకు సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ నేత కోడెల శివప్రసాద్ తెలిపారు. నరసరావుపేటతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని... ఈ నియోజకవర్గ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. నర్సరావుపేట స్థానం నుంచి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాయపాటి సాంబశివరావు విజయం కోసం తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు.