: కాంగ్రెస్ వెబ్ సైట్లో వాజ్ పేయి ఫొటో


బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్ పేయి ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక వెబ్ సైట్లో పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తన సైట్లో వాజ్ పేయి ఫొటో పెట్టడంతోపాటు దాని కింద... 'మోడీ రాజధర్మాన్ని పాటించడం లేదని అటల్ జీ చెప్పారు. సీఎం పదవికి కూడా తగడని అటల్ భావించిన వ్యక్తి (మోడీ) దేశాన్ని ఎలా పాలించగలుగుతారు' అంటూ కాంగ్రెస్ తన సందేశాన్ని పేర్కొంది. అయితే, వాజ్ పేయి ఫొటోను కాంగ్రెస్ తన వెబ్ సైట్లో పెట్టుకోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News