: అఫిడవిట్ దాఖలు చేయాలని మోహన్ బాబుకు సుప్రీం ఆదేశం
'పద్మశ్రీ' వివాదం కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని సినీ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. అయితే, పద్మశ్రీ బిరుదును ఉపయోగించిన అన్ని చోట్ల తొలగించాలని ఆదేశించింది. ఈ కేసుపై నిన్న (గురువారం) సాయంత్రం మోహన్ బాబు, బ్రహ్మానందం సుప్రీంను ఆశ్రయించడంతో నేడు విచారణ చేపట్టింది.