: ఆరుషిపై రూపొందించిన సినిమా విడుదలపై స్టే కోరిన తల్లిదండ్రులు


సంచలనం సృష్టించిన ఆరుషి హత్యోదంతంపై రూపొందించిన 'రహస్య' చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ వైద్య దంపతులు రాజేష్, నూపుర్ తల్వార్ లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో ఆ చిత్రాన్ని వీక్షించిన ఆరుషి తల్లిదండ్రులు.. తమ కుమార్తె మరణంపై వాస్తవాలను వక్రీకరించి చూపారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు మనీష్ గుప్తి, నిర్మాణ సంస్థ యువీఐ ఫిలిమ్స్ ప్రొడక్షన్ పేర్లను పిటిషన్ లో పేర్కొన్నట్లు వారి తరపు న్యాయవాది తెలిపారు.

అసలు సినిమా విడుదల కాకుండా తాము కోరుకోవడంలేదని, ముగింపులో కొన్ని సన్నివేశాలు తప్పించి, కథంతా ఆరుషి కేసుకి దగ్గరగా వుందని వివరించారు. అయితే, ఈ నెల 17కు విచారణకు వాయిదా వేసినట్లు చెప్పారు. మరోవైపు వాస్తవ ఘటనకు, సినిమాలోని సన్నివేశాలకు ఎలాంటి సంబంధంలేదని కేంద్ర సెన్సార్ బోర్డు అలహాబాద్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News