: టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి నామినేషన్ ను పెండింగ్ లో ఉంచిన అధికారులు
వరంగల్ జిల్లా మహబూబాబాద్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి సీతారామనాయక్ కు చుక్కెదురైంది. ఆయన వేసిన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పెండింగ్ లో పెట్టారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రొఫెసర్ గా పనిచేసిన సీతారామనాయక్ తన ఉద్యోగానికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. నామినేషన్ ను తిరస్కరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.