: హిల్లరీ క్లింటన్ పై షూ విసిరిన మహిళ!


అమెరికా మాజీ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ పై ఓ మహిళ షూ విసిరింది. అయితే, అది హిల్లరీకి తగలకుండా పక్కన పడిపోయింది. లాస్ వెగాస్ లోని మండలే బే రిసార్ట్ లో 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్క్రాప్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్' సమావేశానికి ముందు హిల్లరీ కీలక ప్రసంగం చేశారు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం హిల్లరీ మాట్లాడుతూ, ఆ సంఘటనపై జోక్ చేశారు. 'నాపై ఎవరైనా ఓ వస్తువును విసిరారా?' అని ప్రశ్నించారు. దాంతో, అక్కడికి వచ్చిన వారు ప్రశంసిస్తూ పెద్దగా నవ్వారు. అనంతరం హిల్లరీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, షూ విసిరిన మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ సూపర్ వైజరీ స్పెషల్ ఏజెంట్ తెలిపారు. ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News