: ఆయనకు టికెట్ రావడానికి పవన్ కల్యాణ్ ఆశీస్సులే కారణమా?
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడిపల్లి సత్యానికి హీరో పవన్ కల్యాణ్ ఆశీస్సులున్నాయా? అవును, పవన్ చొరవతోనే సత్యానికి టికెట్ వచ్చిందని ఆ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించిన లక్ష్మణ్ వర్గీయులు అంటున్నారు. పవన్ కల్యాణ్ కు సత్యం సన్నిహితుడనే పేరు ఉండడం కూడా వీరి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సత్యం గతంలో పీఆర్పీలో పనిచేశారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ నేతగా కొనసాగారు. అనూహ్యంగా టీడీపీ టికెట్ ను దక్కించుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ లక్ష్మణ్ అది కాస్తా చేజారిందని తెలుసుకుని నిరాశకు గురయ్యారు.