: ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పై దాడి!


బోగస్ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ ను గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని భాగపట్ నియోజకవర్గంలోని మలక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మలక్ పూర్ గ్రామస్థులు సత్యపాల్ సింగ్ మోటార్ కాన్వాయ్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, పౌర విమానయాన శాఖామంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి అజిత్ సింగ్ పోటీలో ఉన్నారు. కాన్వాయ్ పై జరిగిన దాడిలో సత్యపాల్ సింగ్ కారు ధ్వంసమైందని, ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడికి కారణమైన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News