: శ్రీకాకుళంలో బీజేపీకి బలం లేదు: రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలో జిల్లాలో బీజేపీకి క్యాడర్ లేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలో బీజేపీకి సీటు ఇస్తే టీడీపీ కేడరే పూర్తి పనిచేయాల్సి ఉంటుందన్నారు. దీనిపైనే చర్చించేందుకు చంద్రబాబును కలిసినట్లు ఆయన తెలిపారు. పొత్తు బలం కావాలి గానీ, బలహీనత కాకూడదన్నారు. నరసన్నపేట సీటు బీజేపీకి ఇస్తే లోక్ సభకు ఇబ్బందవుతుందని పార్టీ అధినేతకు చెప్పినట్లు రామ్మోహన్ చెప్పారు.