: ఆమెకు టికెట్ ఇస్తే... అంతే!
సాలూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ గుమ్మడి సంధ్యారాణికి ఇస్తే ఓటమి తప్పదని టీడీపీ చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో టీడీపీ టికెట్టును సాలూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. ఈ విషయం తెలిసిన సంధ్యారాణి వర్గీయులు మండిపడుతున్నారు. నియోజకవర్గ పర్యవేక్షకురాలిగా పనిచేసిన సంధ్యారాణి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయారని, ఆశించిన స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లలేదని ఈ సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా... 2006లో హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన భంజ్ దేవ్ తాను ఈసారి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటున్నానని, తనకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతానని అధిష్ఠానానికి ఇప్పటికే విన్నవించుకున్నారు. దాంతో ఈసారి టీడీపీ టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.