: హైదరాబాద్ వాసులూ పారాహుషార్!


అసలే.. భూగర్భ జలాలు ఇంకిపోయి.. బోర్లు పనిచేయక సతమతమౌతోన్న రాజధాని వాసులకు మరో షాకింగ్ న్యూస్.  హైదరాబాదులో రెండురోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నీటి సరఫరా ఆగిపోతుందని 'మెట్రో వాటర్ బోర్డు' అధికారులు తెలిపారు.

దీంతో నగరంలోని కిషన్ బాగ్, హష్క్ మహల్, హైదర్ గూడ, ఉప్పర్ పల్లి, అత్తాపూర్, 9వ నంబర్ వీధి, రాజేంద్రనగర్, గచ్చిబైలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రశాసన్ నగర్, హుస్సేన్ సాగర్ పంప్ హౌస్ ఏరియా, మూసాపేట, బాలానగర్, సనత్ నగర్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతాలు, షాపూర్ నగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు.

ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందంటే..  నగరంలో టోలీచౌకీ నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్స్ కు కృష్ణా జలాలు తరలించడానికి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణా నీటి సరఫరాకు సంబంధించి మైలార్ దేవ్ పల్లి నుంచి ప్రశాసన్ నగర్ వరకు రింగ్ మెయిన్-1 పంపింగ్ మెయిన్ కు షట్ డౌన్ తీసుకుంటారు. ఈ కారణంగా నీటి సరఫరా ఆపివేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News