: ఆజాద్ ను ఓటెయ్యనివ్వని ప్రిసైడింగ్ అధికారి


కేంద్ర మంత్రి ఆజాద్ కు ప్రిసైడింగ్ అధికారి షాకిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని గుర్తింపుకార్డు లేని కారణంగా ఓటెయ్యనీయకుండా ఆపేశారు. జమ్మూకాశ్మీర్ లోని జోజిగేట్ ప్రాంతంలో గల డీపీఎస్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వెళ్లిన గులాం నబీ ఆజాద్ ను అక్కడి ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపుకార్డు చూపాలని అడిగారు.

దానికి ఆయన మర్చిపోయి వచ్చానని చెప్పడంతో, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆయనను ఓటు వేసేందుకు అనుమతించలేదు. ఆజాద్ గుర్తింపు కార్డుకు తాను ష్యూరిటీగా ఉంటానని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొంటానని స్థానిక నేత హామీ ఇవ్వడంతో ఆయనను ఓటు వేసేందుకు అనుమతించారు.

  • Loading...

More Telugu News