: సత్తిబాబు, వీహెచ్, హర్షకుమార్, దత్తాత్రేయ బాకీపడ్డారు


రాష్ట్రం నుంచి ఏ రాజకీయ నాయకుడు వెళ్లినా బసచేసేది ఇక్కడే. బసైతే చేశారు కానీ, బిల్లులు చెల్లించలేదు. దీంతో నేతల అప్పులు వేలల్లో పేరుకుపోతున్నాయి. అధికారులు కూడా గట్టిగా నిలదీసి అడగరు. అదే ధైర్యంతో నేతలు ఏపీ భవన్ కు వేలల్లో బకాయిలు పడ్డారు. బకాయిల వివరాలు అధికారులు వెల్లడిస్తుండడంతో నేతలు ఆఘమేఘాల మీద బకాయిలు చెల్లిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వానికి బకాయిపడి ఉండకూడదు, అలా బకాయిపడితే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అందుచేత నేతలంతా తమ బకాయిలు చెల్లించేందుకు తొందరపడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన, పార్టీలో సీట్ల కోసం లాబీయింగ్ కోసం ఏపీ భవన్ ను విచ్చల విడిగా వాడుకున్న నేతలంతా బకాయిలు చెల్లిస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లోనే 8,12,500 రూపాయలు వసూలయ్యాయి. అన్ని సౌకర్యలు ఉండి రాయితీ ఉండడంతో ఏపీ భవన్ నేతలపాలిట కల్పతరువు అయింది.

దీంతో పరిమితికి మించి అదనంగా వాడుకుని నేతలు ఏపీ భవన్ కు బాకీ పడ్డారు. 12వ లోక్ సభ సభ్యుల్లో బీఎన్ రెడ్డి అత్యధికంగా 1,29,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. దత్తాత్రేయ 2,100 ఇటీవలే చెల్లించారు. 13 వ లోక్ సభ సభ్యుల్లో ఎంపీ జితేందర్ రెడ్డి 52,000 రూపాయలు చెల్లించగా, వీహెచ్ 7,18,350 రూపాయలు రెండు రోజుల క్రితమే చెల్లించారు.

బొత్స సత్యనారాయణ 1,15,500 బకాయి చెల్లించాల్సి ఉండగా, ఆయనకు తోడుగా ఎంపీ హర్షకుమార్ 45 వేలు చెల్లించాల్సి ఉంది. ఇంతింత డబ్బు సాధారణ పౌరులు చెల్లించకుండా ఉంటే వారి ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం, రాజకీయ నాయకుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలపాలవుతోంది.

  • Loading...

More Telugu News