: భారతీయ చిత్రాలను పాక్ లో ఆహ్వానించడం ఆనందకరం: అమితాబ్


బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన 'భూత్ నాథ్ రిటర్న్' రేపు దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దాయాది దేశం పాకిస్థాన్ థియేటర్లలోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనిపై బిగ్ బీ మాట్లాడుతూ, పక్క దేశం పాక్ లోనూ భారతీయ సినిమాలను స్వాగతించడం మంచి విషయమని పేర్కొన్నారు. ఇందుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. మన సినిమాలను వీడియో కాల్ ద్వారా పాక్ లో ప్రమోట్ చేసుకోవచ్చన్నారు. అయితే, పాక్ లోనూ బిగ్ బీకు వేలకొలది అభిమానులు ఉన్నారట.

  • Loading...

More Telugu News