: 13 కేజీల బంగారం స్మగ్లింగ్ వెనుక కారణమిది... !


శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్న 13 కేజీల బంగారం కేసులో పోలీసుల అనుమానాలు నిజమయ్యాయి. ఎన్నికల సమయాన్ని అనుకూలంగా చేసుకుని పెద్ద ఎత్తున బంగారం తరలించాలని స్మగ్లర్లు పథకం రచించారు. ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున బంగారం పట్టుబడుతుండడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆపాదమస్తకం తనిఖీ చేస్తున్నారు.

అలాంటి తనిఖీల్లోనే ఎమిరేట్స్ ఉద్యోగిని సదాఖాన్ పట్టుబడింది. దీంతో విచారణలో తనకు, ఆ బంగారానికి ఎటువంటి సంబంధం లేదని, తాను ఆ బంగారాన్ని వేరేవాళ్లకి అప్పగిస్తే వారు తనకు 5 లక్షల రూపాయలు ఇస్తానన్నారని అమె తెలిపింది. దీంతో కీలక సూత్రధారి సౌజత్ అలీని అదుపులోకి తీసుకున్నారు. బంగారం ఎలా తరలించాల్సింది, ఎక్కడ ఇవ్వాల్సింది అంతా స్మగ్లర్లే చూసుకుంటారు.

కేవలం విమానాశ్రయంలో చెక్ పోస్టులు దాటిస్తే చాలు స్మగ్లర్లు పెద్దమొత్తం ముట్టజెప్పి తమ పని కానిచ్చేసుకుంటారు. నగదు ఒక్కసారిగా పెద్దమొత్తంలో చేతికి వస్తుందనే ఆశతో, పట్టుబడినా తాము చూసుకుంటామన్న స్మగ్లర్ల భరోసాతో అమాయకులు స్మగ్లింగ్ రొచ్చులో చిక్కుకుపోతున్నారు. అందుకు ఉదాహరణే నిన్న జరిగిన 13 కేజీల బంగారం తరలింపు.

  • Loading...

More Telugu News