: బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే: మోడీ
భారత్ నవనిర్మాణం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ... యూపీఏ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతోందని ఆయన విమర్శించారు. బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.