: ప్రమాదం నుంచి బయటపడిన ఎన్నికల పరిశీలకురాలు


ఎన్నికల పరిశీలకురాలికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల నేపథ్యంలో పరిశీలకురాలిగా వచ్చిన ఓ అధికారిణి రంగారెడ్డి జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ లో బస చేశారు. అయితే ఇవాళ ఉదయం ఆ రిసార్ట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో రిసార్ట్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రిసార్ట్స్ లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News