: ఐఐటీలు, ఎన్ఐటీలలో అధ్యాపకులు సగం ఖాళీ
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు. వాటిలో చదివితే ప్రారంభ జీతమే పది లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అవే ఐఐటీ, ఎన్ఐటీలు. బంగారు భవిష్యత్ ను ఇచ్చే ఈ విద్యాలయాలలో ఉపాధ్యాయుల కొరత ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కొన్నింటిలో సగానికి పైగా ఆచార్యుల కొలువులు ఖాళీగా వెలవెలబోతున్నాయి.
దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీ, ఎన్ఐటీలలోనే కాదు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాటిలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రే ఈ ఖాళీల విషయాన్ని కొన్ని రోజుల కిందట లోక్ సభలో వెల్లడించారు. ఇన్ని ఖాళీలుంటే విద్యా ప్రమాణాలు దెబ్బతినడం ఖాయమని ఇప్పడు ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎనిమిది పాత ఐఐటీలలో 5356 అధ్యాపకుల స్థానాలకు గాను.. ప్రస్తుతం 3158 మంది రెగ్యులర్ అధ్యాపకులే ఉన్నారు. అంటే 41శాతం ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఐఐటీగా మార్పు చెందిన బెనారస్ హిందూ యూనివర్సిటీలో అయితే 57శాతం అధ్యాపక స్థానాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీ (50శాతం), ఖరగ్ పూర్ (48), గువహటి (42) మేర ఖాళీలున్నాయి.
ఇక ఎన్ఐటీల విషయానికొస్తే.. 20 ఓల్డ్ ఎన్ఐటీలలో5891 స్థానాలకుగాను 3083 మంది రెగ్యులర్ అధ్యాపకులే అందుబాటులో ఉన్నారు.