: కేటీఆర్ కు కేసీఆర్ రూ.43 లక్షలు అప్పుగా ఇచ్చారట!
కేటీఆర్ కు కేసీఆర్ అప్పు ఇవ్వడమేమిటి అనుకుంటున్నారా? అవును, ఈ నిజం ఇవాళ నామినేషన్లు వేసేటప్పుడు బయటపడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ కు రూ. 43.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు నామినేషన్ లో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ తరపున శాసనసభకు కేటీఆర్ ఇవాళ నామినేషన్ వేశారు. తనకు మొత్తం 1.82 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో తండ్రి కేసీఆర్ నుంచి రూ. 43.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో, ఇవాళ కేటీఆర్ తో పాటు ఆయన తండ్రి కేసీఆర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు.