: ఇకనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం : ఎర్రబెల్లి
విద్యుత్ సమస్యలపై దీక్ష విరమించినప్పటికీ తమ పోరాటం ఆగదని టీడీపీ స్పష్టం చేసింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆ పార్టీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. నేతల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దీక్ష విరమించమని కోరారని, అందువల్లే దీక్ష విరమించినట్లు ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. నిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ ఇబ్బందుల నివారణపై ప్రభుత్వం తరపు నుంచి చర్చలు జరగాల్సిందేనని డిమాండు చేశారు.