: మార్కెట్లో ‘నమో నమః’ పేరుతో మోడీ పెన్నులు
ఎన్నికల వేళ పలు పార్టీల జెండాలు, కండువాలు అమ్ముడుపోవడం మామూలే. అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేరుతో తయారైన వస్తువుల అమ్మకాలు జోరందుకున్నాయి. రాజస్థాన్ లోని అజ్మీర్ లో మోడీ పేరుతో తయారైన ‘నమో నమః’ పెన్నులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేత, ఆయన తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని, బీజేపీ గట్టిగా నమ్ముతోంది. మోడీకి ఉన్న పాప్యులారిటీని సొమ్ము చేసుకోవాలని కొందరు ఆయన పేరుతో కొన్ని వస్తువులు తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేశారు. 'నమో నమః మోడీ' పేరుతో రూపొందిన పెన్నులు రాజస్థాన్ లో ఇప్పుడు జోరుగా అమ్ముడవుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీ ఓ పెన్నుల తయారీ సంస్థతో కలిసి మోడీ పాప్యులారిటీని సొమ్ము చేసుకుంటోంది. ఆ పెన్నులు కొనడం ద్వారా మోడీకి మద్దతు పలకాలని బీజేపీ ప్రజలను కోరుతోంది. మోడీ పేరుతో తయారైన ఈ పెన్నులపై ఆయన ఫోటో కూడా ముద్రించారు.