: కుటుంబ బంధాలు పదిలం... రాజకీయ విభేదాలే: అళగిరి
తమ కుటుంబ సంబంధాలను ఎవరూ దెబ్బతీయలేరని డీఎంకే బహిష్కృత నేత అళగిరి అన్నారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తన తమ్ముడు ఎంకే స్టాలిన్ కు తనకు మధ్య విధానపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు. తమ కుటుంబ సంబంధాలను ఎవరూ దెబ్బతీయలేరని అళగిరి స్పష్టం చేశారు.