: జగన్ ను కలిసిన సీకే బాబు
సీమాంధ్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పార్టీల్లో సీటు దక్కని వారు, ఆశావహులు పార్టీలు మారుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని రసకందాయంలో పడేస్తున్నారు. చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను కలిశారు. ఆయన పార్టీ మారనున్నారా? లేక గౌరవపూర్వక కలయికా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.