: నితిన్ మీద కొండంత ప్రేమ కురిపించిన గుత్తాజ్వాల
ఇవాళ టాలీవుడ్ హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల నితిన్ పై కొండంత ప్రేమను ఒలికించారు. జ్వాల తన శుభాకాంక్షల సందేశం లో ఇలా ఆకాంక్షించారు. 'హ్యాపీ బర్త్ డే నితిన్.. హేవ్ ఎ వండర్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎ హెడ్!!!! లోడ్స్ ఆఫ్ లవ్!!!!' అంటూ ప్రేమాభిమానాలు కురిపించారు.
నితిన్, నిత్యామీనన్ జంటగా నటించిన `గుండెజారి గల్లంతయ్యిందే` సినిమాలో గుత్తాజ్వాల నితిన్ తో కలిసి ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బ్లూకలర్ పొట్టి దుస్తుల్లో జ్వాలా నితిన్ పక్కన చాలా హాట్ గా కనిపించబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 19న విడుదల కాబోతోంది.