: బాంబును నిర్వీర్యం చేస్తూ... ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి


ఓ బాంబును నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్ అధికారులు పొరపాటు చేయడంతో... ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పొరపాటు చేయగా, ముగ్గురు మరణించడంతో పాటు మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన దిలీప్ కుమార్ అనే జవాను తనను రక్షించమంటూ హృదయ విదారకరంగా వేడుకుంటున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమైనా, సీఆర్పీఎఫ్ చీఫ్ దిలీప్ త్రివేది మాత్రం తాము తరలింపులో ఎలాంటి జాప్యం చేయలేదని చెప్పారు.

బీహార్ నుంచి తమ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారని ఆయన అన్నారు. ఐఈడీని నిర్వీర్యం చేయడంలో జరిగినది మాత్రం మానవ తప్పిదమేనని ఆయన అంగీకరించారు. ఎంతటి నిపుణులైనా ఒక్కోసారి పొరపాటు చేస్తారని, దేశ భద్రత కోసం తాము చేసే త్యాగాలను మర్చిపోకూడదని ఆయన చెప్పారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఘటన జరిగితే, 2.30 గంటలకల్లా హెలికాప్టర్ అక్కడ ఉందని, విషమ పరిస్థితిలో ఉన్న జవానును రాంచీలోని అపోలో ఆస్పత్రికి తరలించామని త్రివేదీ తెలిపారు.

  • Loading...

More Telugu News