: నేను, యువరాజ్ స్నేహితులం మాత్రమే: నేహా థూపియా


బాలీవుడ్ నటి నేహ థూపియా, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆ మధ్య చెట్టాపట్టాలేసుకుని ప్రతి పార్టీకి వెళ్లడం, ఎక్కడ చూసినా వారే కనిపిస్తుండటంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, ఆ మాటలను నేహ తీవ్రంగా ఖండిస్తోంది. తమ మధ్య ఎలాంటి సంబంధంలేదని, కేవలం స్నేహితులమేనని తెలిపింది. చాలా చిన్నప్పటి నుంచే తనకు యువీ తెలుసునని చెప్పిన థూపియా.. అలాంటిది ఇద్దరం బయట కనపడితే డేటింగ్ చేస్తున్నట్లేనా? అని ప్రశ్నించింది. వాస్తవానికి తామిద్దరం మంచి స్నేహితులమని, అందులో ఎలాంటి మార్పు లేదని వివరించింది. అంతేకాదు, క్రీడాకారులంటే తనకెంతో గౌరవమని చెప్పుకొచ్చిందీ అమ్మడు.

  • Loading...

More Telugu News