: నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పార్టీ కార్యకర్తలు


నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయాన్ని తెలుగు తమ్ముళ్లు ధ్వసం చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను సంప్రదించకుండా తమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తట్టుకోలేని కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయులు జిల్లా టీడీపీ కార్యాలయంపై జెండా పీకేసి, కుర్చీలను విరగ్గొట్టి, అద్దాలను ధ్వసం చేశారు. అధికారంలో లేకపోయినా పార్టీని, క్యాడర్ ని కాపాడుకుంటూ వస్తున్న తమను విస్మరించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ వాళ్లకి వారి కుటుంబ సభ్యుల ఓట్లు తప్ప అదనంగా ఒక్క ఓటు కూడా రాదని అలాంటి వారికి ఈ సీటు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News