: ముషీరాబాద్ నుంచి నామినేషన్ వేస్తా: విక్రమ్ గౌడ్
గ్రేటర్ హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. వారసులకు టికెట్ కేటాయించేది లేదని చెప్పిన కాంగ్రెస్ కొన్ని కుటుంబాలకు ఎందుకు టికెట్ ఇస్తోందని విక్రమ్ ప్రశ్నించారు. గోషా మహల్ లో మోడీ గాలి లేదు... ముఖేష్ గాలే వీస్తోందని ఆయన అన్నారు. గోషా మహల్ లో ముఖేష్, ముషీరాబాద్ లో తాను విజయం సాధిస్తామని విక్రమ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.