: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నామినేషన్ దాఖలు
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతవరకు డీజీపీగా పనిచేసిన తాను, రిటర్మైంట్ అనంతరం ప్రజాసేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చానని దినేష్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ విధానాలు నచ్చి జగన్ పార్టీలో చేరానని, తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పట్టించుకుంటానని ఆయన తెలిపారు.