: మోడీ కవితలు ఇప్పుడు ఇంగ్లిష్ లో
మోడీలో మంచి కవి కూడా దాగున్నాడు. ఆయన ఊహలు, ఆయన ఎదుర్కొన్న అనుభవాలను కవితల రూపంలో గుజరాతీ భాషలో రాయగా... ఇప్పుడు వాటిని రవి మంత్రి ఇంగ్లిష్ లోకి అనువదించారు. ఈ కవితల గురించి మోడీ మాట్లాడుతూ.. 'నా కవితలు అసాధారణమని అనుకోవడం లేదు. తాజా జలపాతంలా నా కవితలు కూడా నా ఊహలకు, నా అనుభవాలకు అక్షరరూపం' అని చెప్పారు. ఈ కవితలు మోడీని ప్రజలతో అనుసంధానం చేస్తాయని అనువాదకుడు రవిమంత్ర అన్నారు.