: నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి
మెదక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతి మెదక్ లో నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. టీడీపీ తరపున భట్టి జగపతి, టీఆర్ఎస్ తరపున పద్మాదేవేందర్ రెడ్డి కూడా నేడు నామినేషన్లు దాఖలు చేశారు.