: దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు: వెంకయ్యనాయుడు
8 అంశాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారం చేపట్టనున్నారని అన్నారు. పొత్తుల వల్ల టీడీపీ, బీజేపీ పరస్పర సహకారం అందించుకుంటాయని ఆయన చెప్పారు. ప్రజలు మోడీని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎన్డీయే కోసం కాక మోడీ కోసం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.