: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పలు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ రోజు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీే నుంచి మాగంటి గోపీనాథ్ హైదరాబాదులోని షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా వినయ్ రెడ్డి, ఆప్ అభ్యర్థి రాంగోపాల్ యాదవ్ లు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.