: ఓటర్లకు జ్ఞానోదయం కలిగించనున్న యాంకర్ ఉదయభాను


చలాకీ మాటలతో వీక్షకులను ఉత్సాహపరిచే యాంకర్ ఉదయ భాను ఇప్పుడు ఓటు విలువ గురించి హితబోధనలు చేయనుంది. ఓటర్ల అవగాహన కార్యక్రమం కోసం ఒక టీవీ చానల్ 'నిగ్గదీసి అడుగు' పేరుతో ఓ కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభించబోతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఓటర్లలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీనికి ఉదయభాను తన వ్యాఖ్యాన్నాన్ని అందిస్తోంది.

దీనిపై ఆమె మాట్లాడుతూ... ప్రజలకు కనీసం తమ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరన్న విషయం కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించింది. మంత్రులు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తించిందీ ఇందులో తెలియజేస్తామని, చర్చా కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపింది.

  • Loading...

More Telugu News