: ఇస్లామాబాద్ మార్కెట్ లో బాంబు దాడి.. 18 మంది మృతి


పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని సబ్జి మండి పండ్ల మార్కెట్ లో ఈ ఉదయం ఘోర బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే చనిపోగా, యాభై మందికి పైగా గాయాలయ్యాయని పాక్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అత్యంత చాకచక్యంగా పండ్ల బాక్సుల్లో పెట్టిన బాంబులు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి ఐదు కిలోల రిమోట్ కంట్రోల్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది తీవ్రవాదుల హింసాత్మక చర్యేనని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News