: మహంతి పదవీ కాలం పొడిగింపును సమర్థించిన హైకోర్టు


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ గవర్నర్ నరసింహన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. పదవీ కాలం పొడిగింపు అనేది గవర్నర్ విచక్షణాధికారం కిందకు వస్తుందని పేర్కొంది. మహంతి పదవీ కాలం ఫిబ్రవరితోనే ముగిసిపోయింది. కానీ, రాష్ట్ర విభజన పనులు జరుగుతున్న కీలక సమయం కావడంతో ఆయన పదవీ కాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించాలన్న గవర్నర్ సిఫారసు ప్రకారం కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.

  • Loading...

More Telugu News