: నేడు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కేసీఆర్ నామినేషన్లు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు మెదక్ లోక్ సభ స్థానానికి సంగారెడ్డిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు ఈ రోజు ఉదయం 8.15 గంటలకు మెదక్ జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లోక్ సభ, శాసనసభ స్థానాలకు నామినేషన్లు వేసిన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.