: మోత్కుపల్లికి మధిర అసెంబ్లీ సీటు ఖరారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ సీటు ఖరారు అయింది. ఈ మేరకు మోత్కుపల్లికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ కేటాయించారు. రేపు ఉదయం 10 గంటలకు మోత్కుపల్లి మధిర అసెంబ్లీ స్థానానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.