: జాబితాలో ప్రకటించి టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమే: క్రిశాంక్
జాబితాలో పేరు ప్రకటించిన తర్వాత కూడా తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందని విద్యార్థి నాయకుడు క్రిశాంక్ చెప్పారు. హైదరాబాదులో క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థి నేతలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకముందని అన్నారు. 2019 ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ నుంచి టికెట్ లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.