: వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే స్థానాలు మావే: పొన్నాల
వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హైదరాబాదులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గెలుపు అవకాశాలు, సిట్టింగ్ లకు సీట్లు కేటాయించామని చెప్పారు. ఈసారి వెనుకబడిన వర్గాల వారికి 33 శాతం టిక్కెట్లను ఇచ్చామని పొన్నాల తెలిపారు. మహిళలకు వీలైనన్ని సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నించామని ఆయన చెప్పారు.