: ‘జై శ్రీరామ్’ నినాదంతో మార్మోగిన శోభాయాత్ర
శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాదులో ఏర్పాటు చేసిన శోభాయాత్ర ఘనంగా జరిగింది. ధూల్ పేట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రీ, బేగంబజార్, సిద్ధిఅంబర్ బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్ సమీపంలోని హనుమాన్ ఆలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. ఈ యాత్రలో భజరంగ్ దళ్ సభ్యులు కాషాయధారులై పాల్గొన్నారు. ఓం చిహ్నంతో ఏర్పాటు చేసిన భారీ శ్రీరాముని విగ్రహం శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండువగా సాగింది.