: పాకిస్థాన్ రైల్లో పేలుడు... 12 మంది మృతి


పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఒక రైలులో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 30 మంది క్షతగాత్రులయ్యారు. జఫార్ ఎక్స్ ప్రెస్ అనే రైలు సిబి రైల్వేస్టేషన్ లో ఉండగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన బోగీ పూర్తిగా ధ్వంసం కాగా, మంటలు చెలరేగి ఇతర బోగీలకు వ్యాపించాయి. ఈ ఘటన వెనుక ఓ మహిళ ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనుమానిత మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News