: మా కష్టాలు మీకేం తెలుసంటూ మీడియాపై బలరాంనాయక్ చిందులు
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నివాసం వద్ద ఎమ్మెల్యే రేగా కాంతారావు తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదంటూ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆయనను కేంద్ర మంత్రి బలరాం నాయక్ బలవంతంగా పొన్నాల ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా వీరి తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై బలరాం నాయక్ మండిపడ్డారు. 'మా కష్టాలు మీకేం తెలుసు?' అంటూ విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించడమెందుకు... ఆనక వారిని సముదాయించడమెందుకు? అంటూ మీడియా ప్రతినిథులు గుసగుసలాడుకుంటున్నారు.